TG High Court: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట..! 23 d ago
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది. ఒకే ఘటనలో వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని నరేందర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానం దృష్ఠ్టికి తీసుకెళ్లారు. లగచర్ల దాడి ఘటనలో బొంరాస్ పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. అందులో రెండింటిని కోర్ట్ కొట్టివేసింది. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.